

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణం
పేదలకు అండగా ప్రభుత్వం
జనం న్యూస్ సెప్టెంబర్ 04 సంగారెడ్డి నియోజకవర్గంలో
నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డులో పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి, జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు,సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి ,టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడు పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పేదలకు రుణ సహాయం బి సి, ఎస్ సి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ అందించడం సహాయక సంఘాల మహిళలకువడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 39,000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక కుటుంబానికి నూతన రేషన్ కార్డు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో వైద్య సేవల మెరుగు కోసం సంగారెడ్డి లో వైద్య కళాశాల స్థాపన 500 పడకల కొత్త ఆసుపత్రి శంకుస్థాపన వంటి అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. పేదలకు ఇందిరమ్మ గృహ కేటాయింపులు కూడా త్వరలో వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గంలో 213 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.
సంగారెడ్డి మండలానికి సంబంధించి 15 మంది లబ్ధిదారులకు, సదాశివపేట మండలానికి 75 మంది లబ్ధిదారులకు కొండాపూర్ 17 మంది లబ్ధిదారులకు, కంది మండలానికి సంబంధించి ఆరుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. షాదీ ముబారక్ పథకంలో భాగంగా నియోజకవర్గంలోని 123 మంది లబ్ధిదారులకు రూ .1 కోటి 23 లక్షల 14 వేల 27 7 రూపాయలు చెక్కులను లబ్బిదారులకు మంత్రి అందజేశారు సంగారెడ్డి మండలంలో 46 మంది లబ్ధిదారులకు, సదాశివపేట మండలంలో 64 మంది లబ్ధిదారులకు కొండాపూర్ లో 9 మందికి కంది మండలంలో నలుగురికి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.సంగారెడ్డి నియోజకవర్గంలో 6000 మందికి నూతన రేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లాలో రేషన్ కార్డుల కోసం 68 వేల దరఖాస్తులు ఇప్పటివరకు వచ్చినట్లు వీటిలో 39 వేల మందికి నూతన రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 6000 మందికి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు. రేషన్ కార్డులో పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు అర్హులు ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే ఆన్లైన్లో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నూతన రేషన్ కార్డులకు బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం ను ఒకేసారి పంపిణీ చేసినట్లు ఈ నెల నుండి నూతన రేషన్ కార్డులకు, పాత రేషన్ కార్డులలో జత చేయబడిన వ్యక్తులకు సంబంధించి బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు జిల్లాలో నూతన రేషన్ కార్డులు 38526 మంజూరు కాగా పాత రేషన్ కార్డులలో68883 మంది లబ్ధిదారులు అదనంగా చేర్చినట్లు కలెక్టర్ తెలిపారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి 8735.964 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా 4 లక్షల 10 వేల652 రేషన్ కార్డులకు పంపిణీ చేసేలా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.సంగారెడ్డి నియోజకవర్గంలోని 160 సంఘాలకు మెప్మా ద్వారా మొత్తంరూ.25,21,97,000/- నిధులు పంపిణీ చేయబడినట్లు,ఈ నిధులు మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి, స్వయం ఉపాధి కార్యక్రమాల అభివృద్ధికి ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.అనంతరం సంగారెడ్డి చౌరస్తాలో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు