Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 5 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ ఆర్‌పి కాలనీ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇందిరా తో కలసి జిల్లా పరిషత్ హై స్కూల్ కూకట్పల్లి లో చదువుకున్న మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు సహా విద్యార్థులతో కలసి రిక్షా పుల్లర్ కాలనీ ప్రాధమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న ఇందిర ని మరియు ఉపాద్యాయులకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి పాల్గొని ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ సన్మానం చేశారు.కార్పొరేటర్ మాట్లాడుతూ భారత దేశ మాజీ రాష్ట్రపతి, మహా విద్యావేత్త, తత్వవేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం.ఈ సందర్భంగా ఉపాధ్యాయుల పాత్రను స్మరించుకుంటూ, సమాజ భవిష్యత్తు నిర్మాణంలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. విద్య మాత్రమే కాదు, విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి వంటి గొప్ప గుణాలను విద్యార్థుల్లో నాటేది ఉపాధ్యాయులే అని అన్నారు.ఉపాధ్యాయుల కృషి వల్లనే సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొంటూ, ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మరొక్కసారి ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జి. ఇందిరా హెచ్‌.ఎం, రవీందర్, నరసింహ సర్, సంధ్యరాణి, గోపిక, చంద్ర రాణి, అఫ్సారా , సహా విద్యార్థులు రాజేందర్ ,శ్రీనివాస్ , నరేష్, వెంగళరావు తదితరులు పాల్గొన్నారు.