Listen to this article

హైదరాబాద్: సర్వ హంగులతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ (Cherlapalli Railway Terminal) సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చేతుల మీదుగా ప్రారంభం కానుంది.12:30 నిమిషాలకు వర్చ్యువల్‌ (Virtual)గా ప్రారంభించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా ఈ కార్యక్రమంలో వర్చ్యువల్‌గా పాల్గొంటున్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay), పలువురు ప్రజా ప్రతి నిధులు హాజరవుతున్నారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్‌లపై ఒత్తిడి తగ్గించి, నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గో టెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. ఆరున్నరేళ్ల కాల వ్యవధిలో దాదాపు రూ.428 కోట్లతో నిర్మితమైన ఈ టెర్మినల్‌ అందుబాటులోకి వస్తే