

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి జనవరి 28 (జనం న్యూస్):-
పెద్దారవీడు : మండలంలోని గొబ్బూరు, దేవరాజు గట్టు మధ్యలో గల జాతీయ రహదారిపై సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తన సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించని వాహన చోదకులకు భద్రతపై అవగాహన కల్పిస్తూ మంగళవారం చలానాలు విధించారు. ప్రాణం ఎంతో విలువైనదని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే రోడ్లపై ప్రయాణించాలని, అదేవిధంగా కారులో ప్రయాణించే వారు సీట్ బెల్టు పెట్టుకొని ప్రయాణించాలని కోరారు. దగ్గరే కదా అనుకొని హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే మృత్యువు మీ వెనకే ఉండవచ్చు అనే విషయాన్ని గమనించాలని తెలిపారు.