

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
రైతులు కలెక్టర్ కు పెట్టుకున్న అర్జీ పై మూడు వారాల లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఆదేశం.
చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామం లో 1975 లో ప్రభుత్వం 120 దళిత , గిరిజన కుటుంబాల కు 416 ఎకరాలు భూమిని అసైన్డ్ చేసింది.ఆ బీడు భూముల ను ఎన్నో కష్టాలు పడి చదును చేసుకొని ప్రభుత్వం కల్పించిన బోర్లు , లిఫ్ట్ ఇరిగేషన్ సౌకర్యం తో ఏడాది కి రెండు పంటలు వరి మరియు ఆరుదడి పంటలు పండించు కుంటూ జీవనం సాగిస్తున్నారు.ఆ భూముల్లో గ్రానైట్ రాయి ఉన్నదని గ్రహించి 2021 లో ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది.భూమి స్వాధీనం లో 2013 భూసేకరణ చట్టం అమలు చేయకుండా బలవంతంగా రైతుల ను బెదిరించి, మీరు అంగీకరిస్తే నష్ట పరిహారం ఇస్తామని లేకుంటే బలవంతంగా నైనా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని దళిత , గిరిజనుల ను మోసం చేసింది.
120 మంది లబ్ధిదారులకు గాను ప్రస్తుతం వారి వారసులు 244 మందిగా ప్రభుత్వం గుర్తించింది.వారందరికీ ఎకరానికి 8.33 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించారు.ఆ రోజు నుండి పేద రైతులు , రైతు సంఘాల ఆధ్వర్యంలో మాకు చట్ట ప్రకారం న్యాయ మైన పరిహారం ఇవ్వాలని లేదా మా భూములు మాకు ఇవ్వాలని పోరాటం నిర్వహించారు. అధికారుల కు ఎన్నో సార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా వారి మొరను ఆలకించిన వారే లేరు.గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టు ప్లీడర్ వి. రవీందర్ ని కలిసి రైతులు హైకోర్టు లో రిట్ పిటీషన్ వేశారు.పిటీషన్ ని , రైతులు అధికారుల కు పెట్టుకున్న అర్జీ లను పరిశీలించి మూడు వారాల లోగా కలెక్టర్ కోర్టు కి తెలియజేయాలని ఆదేశించింది.2013 భూసేకరణ చట్టం మరియు ఆ భూమి లో ఉన్న చాలా విలువైన గ్రానైట్ రాయి యొక్క విలువ ను కూడా పరిగణలోకి తీసుకొని ఎకరాకు 40 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని పిటీషనర్ల తరుపు న్యాయవాది వి. రవీందర్ కోర్టులో వాదనలు వినిపించారు.ఈ రోజు రైతులు కలెక్టర్ ని కలిసి కోర్టు ఆదేశాల మేరకు మా భూములకు న్యాయ మైన పరిహారం ఇప్పించాలని కోరారు.వై. రాధా కృష్ణ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.టి. పెద్దిరాజు , వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు.వి. వెంకటస్వామి, యడవల్లి రైతులు సుభాషిణి రాణి ఏసమ్మ