


జనం న్యూస్. జనవరి 28. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని బి.వి.ఆర్ ఐటి కళాశాలలో విష్ణు వెంచర్ ల్యాబ్ ఫౌండేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ లోగోను సగర్వంగా కేవీ. విష్ణు రాజు. ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో . కళాశాల చైర్మన్ కె.వి. విష్ణు రాజు.వైస్ చైర్మన్, రవిచంద్రన్. రాజగోపాల్. ప్రిన్సిపాల్, డా. సంజయ్ దూబే.డైరెక్టర్ డాక్టర్ కె లక్ష్మీ ప్రసాద్ , ఇన్నోవేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎం కె కౌశిక్. ఐఐసి సెల్ ఇంచార్జి డాక్టర్ పి చంద్ర బాబు, ఇడిసి సెల్ ఇంచార్జి డాక్టర్ కె శ్రీనివాసరావు, వివిధ విభాగాలు అధ్యాపకులు. విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఇంజినీరింగ్ విద్యార్థులు అధ్యాపకులకు స్టార్టప్‌లు ఆవిష్కరణల ఆకాంక్షలతో సాధికారత కల్పించడం, వారి వ్యవస్థాపక వినూత్న ఆశయాలను కొనసాగించేందుకే ఈవేదికను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇంక్యుబేషన్ సెంటర్ భవిష్యత్తులో క్యాంపస్ ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చైర్మన్ కొనియాడారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్ యాక్ట్ అందించిన ఐఐసీ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రతిష్టాత్మకమైన 4-స్టార్ రేటింగ్‌ను సాధించినందుకు బి.వి.ఆర్ ఐటి కళాశాల యజమాన్యం అధ్యాపకులను విద్యార్థులను అభినందించారు.