

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో గురువారం రాజంపేట జిల్లా కోర్టుకు హాజరవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పై అనేక అక్రమ కేసులు పెట్టారని జగన్ ప్రభుత్వంలో నిరంకుశ పాలన జరిగిందని ఎదిరించిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి జైలు పంపించారన్నారు ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో పనిచేసేమన్నారు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం ప్రశాంతమైన వాతా వరణంలో ప్రజలు నివసిస్తున్నారు తదుపరి వాయిదా అక్టోబర్ 17 తారీకు అని తెలిపారు కోర్టుకు హాజరైన వారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత అసెంబ్లీ అధికార ప్రతినిధి సీనేపల్లి హరీష్ ,టిఎన్ఎస్ఎఫ్ నాయకులు సురేష్ బాబు, కరుణాకర్ రాజు హాజరయ్యారు