Listen to this article

కోనేటి లింగాల గెడ్డ గండి నీ పరిశీలించిన టిడిపి నాయకులు

జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

భారీ వర్షాల కారణంగా బడే వలస గ్రామ పరిధిలో ని కోనేటి లింగాల గెడ్డ గండిపడటంతో ముంపునకు గురైన పంటలను మండల టిడిపి అధ్యక్షులు చలుమూరు వెంకట్రావు సందర్శించి పరిశీలించారు. వరదలు కారణంగా ముంపున కు గురైన పంట పొలాల రైతులతో ఆయన మాట్లాడారు. టిడిపి ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని రైతులకి ఎటువంటి నష్టం వాటిల్లిన ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని రైతులకు ధైర్యం చెప్పారు. మరోసారి ఈ విధంగా గండిపడకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడతామని పంట నష్టం కి సంబంధించి మంత్రి సంధ్య రాణి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గెద్ద అన్నవరం, పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు, పెదమేడ పల్లి ఎంపీటీసీ రెడ్డి నాయుడు, తాడ్డి తిరుపతి, తాడ్డి నాగరాజు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.