

జనం న్యూస్ 06 సెప్తెంబెర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరంలోని బొబ్బాది పేటకు చెందిన హరీశ్ (22) బుధవారం రాత్రి వినాయకుని ఊరేగింపులో డాన్సు చేస్తూ కుప్పకూలాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్దారించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీశ్ క్యాంపస్ సెలక్షన్లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఎంపికైనట్లు కుటుంబీకులు తెలిపారు.