Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల విద్యాలయం లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం పాఠశాలలో మండల ఎం ఈ ఓ గడ్డం బిక్షపతి కి శాలువాతో సన్మానం చేశారు మండలంలోని కాట్రపల్లి గ్రామంలోని సి యస్ ఐ బి జె యం ఉన్నత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల కరస్పాండెంట్ రెవరెండ్ జూన్ చేరియన్ పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంబించారు. ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ గురువులను ఎప్పుడూ గౌరవించుకోవాలని, వారి త్యాగ పూరితమైన బోధలను అనుసరించి మంచి జ్ఞానవంతులుగా ప్రతి విద్యార్థి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో పాఠశాల కరస్పాండెంట్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమములో ఉపాధ్యాయులు సురేందర్ సధాకర్ రాజునాయక్, రాజన్న, బిజయ్, సామెల్, ప్రవళిక, శైలజ, ఉమ, శృతి, జెస్విన్, లిబి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు….