

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, జనవరి 28 (జనం న్యూస్):-
రాచర్ల మండలం జేపీచెరువుకు చెందిన గురుమూర్తి భార్య మాధవని ముక్కలు ముక్కలుగా నరికి ఉడకబెట్టి ఎముకలను పొడి చేసి చెరువులో కలిపి వేశాడు. పోలీసుల వద్ద భార్య తప్పిపోయిందంటూ నాటకాలు ఆడాడు. మాధవి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేశారు. గురుమూర్తి భార్యను అతి కిరాతకంగా హత్య చేసినట్లుగా రాచకొండ సిపి సుధీర్ బాబు మంగళవారం మీడియాకు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తున్నట్లు సిపి చెప్పారు.