Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 06 సంగారెడ్డి జిల్లా

పటాన్ చెరు పట్టణంలో ఉన్న టంగుటూరి అంజయ్య స్మారక ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ గురు స్వామి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం, వీల్ చైర్స్,, స్ట్రెచర్స్ పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక నాయకుడు గురు స్వామి నర్ర భక్షపతి, గురు స్వామి అయ్యప్ప బ్యాటరీ శంకర్ ఇరువురు విచ్చేసి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ గురు స్వామి సంజీవరెడ్డి సంవత్సరం నుండి రామేశ్వరం బండ గ్రామ పరిధిలో ఉన్న మదర్ మేరీ అనాధ వృద్ధుల సేవ ఆశ్రమంలో అక్కడ ఉన్న సుమారు 40 మందికి అల్పాహారం పంపిణీ చేసి వారితో కాసేపు సరదాగా మాట్లాడి అనంతరం పటాన్చెరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు రోగుల బంధువులకు సుమారు 300 మందికి అల్పాహారం పంపిణీ చేశారు, రోగులకు అవసరపడే వీల్ చైర్స్, స్ట్రెచర్స్ పెద్ద మనస్సు తో ఇవ్వడానికి ముందుకు వచ్చారు, (ఆర్ ఎం ఓ) డాక్టర్ ప్రవీణ, ఇంచార్జ్ సూపర్డెంట్ డాక్టర్ ప్రేమ్ కిషోర్ వీరికి స్వాగతం పలికారు. గురు స్వామి సంజీవరెడ్డి వీరికి శాలులతో సన్మానం చేసి రిబ్బన్ కట్ చేసి రోగులకు వీల్ చైర్స్ మరియు స్ట్రెచర్స్ ఇవ్వడం జరిగింది, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి,రోగులకు అత్యవసరమున్న ముందుకు వచ్చి సహాయం చేయాలని అన్నారు. భగవంతుడు మీకు మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపిపి గురుస్వామి సంజీవరెడ్డి, కార్మిక నాయకుడు గురుస్వామి నర్ర బిక్షపతి, గురుస్వామి అయ్యప్ప స్వామి బ్యాటరీ శంకర్, పవన్ చారీ, సూపర్వైజర్ ప్రభాకర్, బాలాజీ చారీ, రవి, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.