Listen to this article


జనం న్యూస్ జనవరి 28 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం

చిలిపి చెడ్ మండలం 28/01/2025 రోజు మంగళవారంనాడు. చిలిపి చెడు మండల్ ఎం ఆర్ ఓ ముసాదిక్ గారు షాదీ ముబారక్ .కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఉన్నదని .బీ ఆర్ఎస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులకు మంగళవారం చెక్కుల పంపిణీ ఉందని తెలియజేశారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ జరుగుతుందని తెలియజేశారు. ఉదయం మంగళవారం రోజున ప్రోగ్రాం క్యాన్సిల్ చేయడం జరిగిందని మరలా ఫోన్ చేసి లబ్ధిదారులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలపడం జరిగింది. చెక్కుల పంపిణీ ప్రోగ్రాం ఉన్నదాన్ని తెలపడం ఉదయాన్నే లేవగానే ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అని తెలపడం . ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది. ఎమ్మార్వో గారిని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రోగ్రాం ఎందుకు క్యాన్సల్ అయిందని అడగగా. మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దేవదాయ శాఖ మినిస్టర్ కొండా సురేఖ చేతుల మీదుగా త్వరలోనే షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని ఎమ్మార్వో తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మార్వో గారికి మెమొరంగం సమర్పించడం జరిగింది . మంత్రిగారి ప్రోగ్రాం కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని మంత్రి గారిని లక్ష తో పాటు తులం బంగారం అడిగి నిలదీయడం జరుగుతుందని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల్ బీఆర్ఎస్ పార్టీ పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు