

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):-
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు లో సోమవారం అర్ధరాత్రి సమయంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు హల్చల్ చేశారు. కారులో వచ్చిన యువకులు ఓ చిరు దుకాణ యజమాని మెడ నుంచి బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు. తర్వాత ఆ దుకాణంపై బీరు సీసాలతో దాడికి పాల్పడినట్లుగా దుకాణ యజమాని వెల్లడించాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధితుడు తెలిపారు.