

జనం న్యూస్:6 సెప్టెంబర్ శనివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేటలోని పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం క్విజ్ పోటీ, అంతాక్షరి కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతిని స్వాతి మేడం, రెండవ బహుమతిని మానస మేడం, మూడవ బహుమతిని మల్లికా మేడం గెలుచుకున్నారు.కార్యక్రమం ఆరంభంలో విద్యార్థులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ భాస్కర్ ను సన్మానించి, అనంతరం ఉపాధ్యాయులందరినీ ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, “డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆయన ఒక ఉపాధ్యాయునిగా ప్రారంభించి భారతరత్న, భారత రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాలను అధిరోహించారు. ఆయన జీవితం ఉపాధ్యాయులకు ప్రేరణ” అని పేర్కొన్నారు.
పాఠశాల డైరెక్టర్ మల్లికా మేడం మాట్లాడుతూ, “జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం విద్యా వ్యవస్థలో మనందరికీ గర్వకారణం” అని అభిప్రాయపడ్డారు.తదుపరి ఉపాధ్యాయులు **స్వాతి , మమతా, శ్రీలత ,సనా , మౌనిక , ఫర్హీన్ మానస .