Listen to this article

ది. 06.09.2025 శనివారం నాడు పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ అధ్యక్షతన కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు 2024-25 విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఐ .సుధ మాట్లాడుతూ కన్నతల్లికి, పుట్టిన ఊరికి సేవ చేసుకోవడం చాలా గొప్ప విషయమని, ఈ రోజు కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. గత సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రథమ స్థానం సాధించిన యాళ్ళ దుర్గా అక్షయకి మొదటి బహుమతి రూ.15000/-, ద్వితీయ స్థానం సాధించిన తిరుమాని సత్యవేణి కి రూ.10000/- మరియు తృతీయ స్థానం సాధించిన వైధాని ఐశ్వర్య కి రూ.5000/- అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కమిడి శాంతనుడు మాట్లాడుతూ గత కొంతకాలంగా కమిడి నీలయ్య జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వాటిలో భాగంగా పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని వారు తెలియజేశారు.అదేవిధంగా మరొక సంస్థ వారు జంగా పురుషోత్తం విద్యార్థిని విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులుగా 3000 రూపాయలు 2000 రూపాయలు మరియు 1000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ కాశి శ్రీనుబాబు, ఫౌండేషన్ సెక్రటరీ కె.ఎం.వి. ప్రసాదరావు, ఉపాధ్యాయులు ఎన్ఎస్ సత్యనారాయణ, ఇళ్ల గణేష్, ఎం శ్రీనివాసరాజు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.