Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )

మునగాల మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన రైతు మద్దనాల లింగయ్య ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగారు. వెంటనే సూర్యాపేట ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఆయన మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.