Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 28 (జనం న్యూస్):- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 30న గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల కంభం యందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జే. రవితేజ సోమవారం తెలిపారు. జిల్లాలోని 19 సం. నుండి 30 సం. మధ్య గల నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూ కు పాన్ కార్డు, ఆధార్ కార్డు, సరిఫికేట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని మరిన్ని వివరాలకు 8109311043, 7997151082 నెంబర్ ను సంప్రదించాలన్నారు.