Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 07(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )

త్వరలో జరగబోయే ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ జాబితా,పోలింగ్ స్టేషన్ల జాబితాలు సిద్ధమయ్యాయని,మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ తెలిపారు.శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఈ జాబితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈనెల 8న ఎంపీడీఓ కార్యాలయంలో ఈ జాబితాల పై రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.