

జనం న్యూస్ సెప్టెంబర్ 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఆటో కార్మికులు ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూఈ నెల 9న అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కు ఆటో కార్మికులుతరలి రావాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ పెడరేషన్ (ఏఐటీయూసీ )జిల్లా అధ్యక్ష, కార్యదర్శి లు పెద్దిరెడ్ల నాగేశ్వర రావు, కోరిబిల్లి జగదీష్ పిలుపునిచ్చారు.
శనివారం స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రీ బస్సు వల్ల ఆటో కార్మికులు ఉపాధి లేక మా కుటుంబాలు ఆకలి తో రోడ్లు పడే పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంస్థ లో ఆటో కార్మికులు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. అలాగే పిఎఫ్,ఈఎస్ఐ తో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీ లోగా సమస్య లు పరిష్కారం చేయకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించిస్తామని తెలిపారు.సమావేశం లో బాపు నాయుడు, మార్కెండేయలు నాగల వెంకటేశ్వర రావు, కూన పల్లి అప్పలరాజు, పోలమర శెట్టి అంజి, , నూకరాజు, వాయి బోయిన వెంకటేష్, పాల్గొన్నారు