Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం గురుపూజోత్సవం సందర్భంగా మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమం విద్యాశాఖ అధికారి గడ్డం బిక్షపతి ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ సభ ప్రాంగణం లో గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా ఉపాధ్యాయులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి గడ్డం బిక్షపతి ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పదో తరగతి పరీక్ష ఫలితాలను 98 శాతంతో ఉత్తీర్ణత సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు ఈ అభివృద్ధికి మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషికి అభినందించారు ఉపాధ్యాయుల సేవలు ఇంకా ముందు ముందు కూడా విద్యార్థులకు విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత మరింతగా ఉండాలని అన్నారు మండలంలోని సుమారు 27 మంది ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సన్మానం చేశారు ఈ సమావేశం లో ఉపాధ్యాయులు సురేందర్ సారయ్య శివశంకర్ తిరునగరి శ్రీనివాస్ రాయిని సుధాకర్ చల్ల అశోక్ పి స్వప్న రాణి మాధవి టి శ్రీలత కే సంధ్య వివిధ గ్రామాల టీచర్లు తదితరులు పాల్గొన్నారు…..