

జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్టిఐ నిఘా న్యూస్, ఆర్టిఐ లైవ్ ఛానల్ క్యాలెండర్ ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ దేవిడ్ చేతుల మీడిగా ఆవిష్కరణ…చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి అక్షరం ప్రజల కోసం అనే నినాదంతో వార్తల వెనక వాస్తవాన్ని సమగ్రమైన కథనాలతో ప్రజలకు అందించే కర్తవ్యాన్ని ఆర్ టీ ఐ నిఘా దినపత్రిక అందిస్తుందని స్పష్టం చేశారు. పాఠకుల, ప్రజల విశేష ఆదరణతో “ఆర్ టీ ఐ నిఘా ” ఇప్పుడు ప్రధాన మీడియా సంస్థల సరసన చేరింది. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ పరిజ్ఞానంతో పట్టణ, గ్రామీణ తేడా లేకుండా అన్ని సెక్షన్ల ప్రజలకు చేరువైంది. క్యాలెండర్ ఆవిష్కరణలో అన్నారు. ఆర్ టీ ఐ నిఘా జిల్లా బ్యూరో బృందం యాజమాన్యం ప్రత్రిక సోదరులు తదితరులు పాల్గొన్నారు