Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నిన్న జరిగినటు వంటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు,మేడా రఘునాథ రెడ్డి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎల్లో మీడియాలలో దుష్ప్రచారం చేయడం దారుణమని నందలూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైయస్ఆర్ కుటుంబానికి మరీ ముఖ్యంగా వైయస్ జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల్లో మేడా రఘునాథ్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని, అటువంటి వారిపై ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ కు పాల్పడ్డారని, అవాస్తవమైన వార్తలను ప్రచారం చేయడం హేయమైన చర్యగా మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తు న్నామని ఆయన అన్నారు.ఇది వరకే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ని కలిసినందుకు, మేడా రఘునాథ్ రెడ్డి పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందని, కేవలం మర్యాద పూర్వకంగానే కలవడం జరిగిందని ఆయన తెలియజేసిన సరే,ఎల్లో మీడియా కావాలనే ఉద్దేశ పూర్వకంగానే ఆయనపై బురదజల్లడం మంచి పద్ధతి‌ కాదని ఆయన హెచ్చరించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీ సంబంధించిన 11 మంది ఎంపీలు పార్టీ విధి విధానాలకు అనుగుణంగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడం జరిగిందని ఆయన తెలియజేశారు.ఇటువంటి దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన హెచ్చరించారు.ఈ యొక్క కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల పంచాయతీ వింగ్ అధ్యక్షులు, నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ మాజీ 7th వార్డ్ మెంబర్ ముమ్మడిశెట్టి సుధాకర్, మండల మైనారిటీ సీనియర్ నాయకుడు షేక్ మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.