

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 11 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ)కి రెండవసారి పల్నాడు జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనందుకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య నుంచి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గురువారం నరసరావుపేట లోని గల ఆయన నివాస గృహం నందు మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలువతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సమాఖ్య కు రాష్ట్ర సహాయ కార్యదర్శి గా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. ప్రధానంగా పల్నాడు ప్రజల జీవనాడి అయిన వరికిపూడి శెల కోసం కృషి చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు,తాగునీరు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో గిరిజన సమాఖ్యను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. సిపిఐ నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.