

_ప్రజా ప్రభుత్వంలో అన్నికులల అభివృద్ధికి పెద్దపీట ఎమ్మెల్సీ దండే విఠల్
జనం న్యూస్ జనవరి 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కౌటల మండలం సదాశివపేట లో ఎస్సీ కమ్యూనిటీ హాల్ 5 లక్షల రూపాయలు మరియు గురుడుపేట్ గ్రామంలో మాలి సంఘం 5 లక్షల రూపాయలతో భవనం నిర్మాణానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ భూమి పూజ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క కుల సంఘాల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు.కుల సంఘాల అభివృద్ది నిధులు కేటాయించిన ఎమ్మెల్సీ దండే విఠల్ ని గ్రామస్తులు సత్కరించి ధన్యవాదాలు తెలుపుకున్నారు. అనంతరం తలోడి గ్రామాల్లో పలువురు గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ది పాలనకి ఆకర్షితులై ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో పార్టీలో చేరారు.అనంతరం తలొడి గ్రామంలో 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సడం గణపతి మాజీ ఎంపీపీ లు బసార్కర్ విశ్వనాథ్ డబ్బుల నానయ్య ఈర్త సత్యం నికోడె గంగారాం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్దన్ నాయకులు ఉమ మహేష్ రవీందర్ గౌడ్ బడుగు బలహీనర్గాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు