

జనం న్యూస్ సెప్టెంబర్ 11
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యాఫై, తాజా మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి మరియు దర్గా ఉర్సు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామంలోని హజ్రత్ షేక్ షాబుద్దీన్ షయీద్ దర్గా ఉర్స్ ఉత్సవాలలో పాల్గొని దర్గాను దర్శించుకొని చాదర్ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన కవ్వాలి కార్యక్రమంలో పాల్గొని హరీష్ రావు మాట్లాడుతూ శేఖపూర్ గ్రామంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న జాతర కార్యక్రమం పట్ల ఉర్సు కమిటీ నిర్వహకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖిజర్ యాఫై చెస్మ్మోద్దీన్ గార్లను అభినందించి ఇంత పెద్ద ఎత్తున ఉర్సు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు తట్టు నారాయణ వెంకటేశం నర్సిములు ,సంజీవ రెడ్డి ,బిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు మోహియోద్దీన్ ,యాకూబ్,సీనియర్ నాయకులు నామ రవి కిరణ్ మొహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ సీనియర్ లీడర్ జహీరాబాద్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ డివిజన్ ప్రెసిడెంట్ గడ్డమీది విజేందర్ రెడ్డి తాజా మాజీ యం.పి.టి.సిలు, మాజీ సర్పంచ్ లు గ్రామాల అధ్యక్షులు నియోజకవర్గ ముఖ్య నాయకులు హరీషన్న అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
