Listen to this article

జనం న్యూస్- జనవరి 28- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు , ఓపి, క్యాజువాలిటీ, ఎం సి హెచ్, లేబర్ వార్డులను ఆమె పరిశీలించారు, వైద్య సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు, ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా సాగర్ కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు అధునాతన యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయని క్యాజువాలిటీ అత్యవసర సేవలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు, సాధారణ ప్రసవాలను పెంచాలని ఆసుపత్రి వైద్య సిబ్బంది కి సూచించారు, వెంట ఆసుపత్రి సూపరిండెంట్ భాను ప్రసాద్ నాయక్ డాక్టర్ హరికృష్ణ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.