Listen to this article

జనం న్యూస్ 12 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో దిడ్డి వాగు దాటుతుండగా గల్లంతై, మృతి చెందిన మొగులప్ప కుటుంబ సభ్యులను పరామర్శించి, తక్షణమే బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరుపున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కను అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. సంఘటనకు గల కారణాలను స్థానిక నాయకుల ద్వారా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. అనంతరం దిడ్డివాగుపై వర్షకాలంలో రైతులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తడంతో చిట్టినాడ్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించే విధంగా చూడాలని ఫ్యాక్టరీ యాజమాన్యంకు ఆదేశించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.మల్కాపూర్ నుండి సంగెంకలాన్ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, ఈ రోడ్డు పనులు పూర్తి అయితే సంగెంకలాన్ గ్రామంలో ఉన్న రెండు వాగులకు బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని గ్రామస్తులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎక్స్‌గ్రేషియాతో పాటు భాదిత కుటుంబ సభ్యులలో ఒకరికి చిట్టినాడ్ ఫ్యాక్టరీలో ఉద్యోగంతో పాటు ప్రభుత్వం నుండి రైతుభీమా, తక్షణమే ఇందిరమ్మ ఇళ్ళు కూడా మంజూరు చేస్తామని బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంబడి డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కేట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు, అధికారులు ఉన్నారు.