Listen to this article

బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య

జనం న్యూస్, సెప్టెంబర్ 12, (తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

జగదేవపూర్ యూరియా కొరత రైతుల వెత మండలం లో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పనులు వదులకొని సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. సరిపడా యూరియా అందకపోవడంతో రైతులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారని మండల బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచరం కనకయ్య అన్నారు,శుక్రవారం మండల కేంద్రం లో ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా సరఫరా తక్కువగా ఉండడం, అనూహ్యంగా గత ఏడాదికన్నా పంటల సాగు పెరగడంతో ఈ సమస్యలు నెలకొన్నాయి. యూరియా వాడితే తప్పా దిగుబడి ఆశించిన స్థాయిలో రాదనేది రైతుల బావన. దీంతో ఎప్పటిలాగే యూరియా కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రనక.. పగలనక ఎరువుల విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తిండి, తిప్పలు మానపొద్దంతా లైన్లలో ఉన్నా ఒక్కొక్క సారి ఒక్క బస్తా కూడా దొరకడం లేదు. దీంతో సహనం కోల్పోయిన రైతులు ఆందోళనలకు గురవుతున్నారు,కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కోట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని, రైతు రాజ్యం ఇదేనా సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు, బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు ఎరువుల కొరత లేకుండా సకాలంలో ఎరువులు అందించిన ఘనత కేసీఆర్ కు దక్కించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో సబ్బండ వర్గాల ప్రజలకు సమస్యలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల బస్సులో మహిళలు సీట్లు దొరక్క కొట్టుకుంటున్న సందర్భాలు చూశానని, ప్రస్తుతం యూరియ దొరక్క మార్కెట్ యార్డులోనే మహిళలు శిగపట్లు పట్టుకోవ డానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండి పడ్డారు. పంటకు సకాలంలో యూరియా అందక ఎదుగుదల ఆగిపోతుందని, యూరియా అందించడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపించారు. ఒక యూరియా బస్తా కోసం రోజల తరబడి పడిగాపులు, రాత్రి పూట జాగారం చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. రైతులు ఇటు యూరియా కోసం ఆటు పంట కోసం పడరాని ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అంటేనే కరువులు చిరునామా అని, రైతులకు యూరియా అందించాలని, పంట నష్టం ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.రైతుల పట్ల ఎంపీ రఘునందన్ రావు చిన్న చూపు చూస్తున్నారని అన్నారు, గజ్వేల్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి,మాతృమూర్తి వజ్రమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే కాగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మంగళవారం జాగదేవ పూర్ మండలం లోని దౌల పూర్ గ్రామానికి వెళ్లి పరామర్శించి వస్తున్న క్రమంలో యూరియా కోసం రైతులు అల్లాడుతుంటే రైతులను చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్లిన ఎంపీ రఘునందన్ రావు అని చెప్పారు.రైతులు అంటే మీకు ఎందుకు అంత చిన్న చూపు అని మండ్డి పడ్డారు.