

అమలాపురం పట్టణం ఉన్న బీజేపీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం సేవా పక్వాడ్-2025 మండల కార్యశాల సమావేశం మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు అయ్యల భాస్కరరావు(భాషా) అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు, సేవా పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 17 వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు నిర్వహించబోయే సేవా కార్యక్రమాల గురించి నాయకులకు వివరించారు. బీజేపీ పార్టీ అధిష్టానం ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలో 17 వ తేదీన స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, మండలంలో ఉచిత వైద్య శిబిరాలు, రక్త దాన శిబిరాలు లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, పార్టీ నాయకులందరూ ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని బాధ్యత నిర్వహించాలని, విద్యార్థులకు ఆటల పోటోలు నిర్వహించాలని, సెప్టెంబర్ 25న దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బూత్ స్థాయిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఆయన తెలిపారు. అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా పక్వాడ్ మండల ఇంచార్జి లు పావులూరి వెంకట్, దాట్ల సుబ్బరాజు, చిలకమర్రి కస్తూరి, రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ కన్వీనర్ ఆకుల వీరబాబు, సీనియర్ నాయకులు సంసాని రత్నకుమార్, బచ్చు ప్రభాకర్, చిలకమర్రి సాగర్, జంగా రాజేంద్ర కుమార్ దాకే వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
