Listen to this article

జనం న్యూస్ ” కాట్రేనికోన, సెప్టెంబర్ 12 :

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో కుండాలేశ్వర క్షేత్రానికి బస్ – ఏర్పాటు చేయాలనీ కుండాలేశ్వరంలో పార్వతి పరమేశ్వర ఆలయానికి వచ్చే భక్తులు ప్రభుత్వని కోరుతున్నారు. ప్రవచకులు కోటేశ్వరరావు కాశీ చాగంటి సందర్శించిన సందర్భంగా అక్కడ ఒక భ్రహణుడు మీరు కుండాలేశ్వరం దర్శించారా అని అడిగారని కాశీ వచ్చేముందు కుండాలేశ్వరని దర్శించి హృద గౌతమీ నదిలో స్నానము చేసి కుండాలేశ్వర క్షేత్రని దర్శించి అప్పుడు కాశీ ని దర్శనం చేసుకోవాలని చూచించారాని ప్రసంగంలో ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుండి కాశీ కి వేలే భక్తులు ముందుగా కుండాలేశ్వర క్షేత్రని దర్శనం కోసం కుండాలేశ్వరం వేలాది మంది భక్తులు వస్తున్నారు. వారికీ సరైన రవాణా సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని గతంలో కుండాలేశ్వరం బస్సు సౌకర్యం ఉండేది అని ఇప్పుడు మరలా భక్తుల సౌకర్యం కోసం బస్సు ఏర్పాటు చేయాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.