Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

రాజంపేట ఏ ఎస్ పి మనోజ్ కుమార్ హెగ్డే ఆదేశాల మేరకు రాజంపేట రూరల్ ఇన్స్పెక్టర్ బి వి రమణ ఆధ్వర్యంలో ఈరోజు నందలూరు సబి ఇన్స్పెక్టర్ వి మల్లికార్జున్ రెడ్డి మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో 07- 07- 25 సాయంత్రం నందలూరు మండలం లేబాక గ్రామం మరాఠపల్లి కి చెందిన సిందే పద్మావతి బాయి వయసు 50 సంవత్సరములు చంపాలనే ఉద్దేశంతో మచ్చు కత్తితో దాడి చేసి పారిపోయిన వాయకారి నర్సింహులు 36 సంవత్సరము అనంతపురం టౌన్ అనే వ్యక్తిని నందలూరు బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని అతని నుండి మచ్చు కత్తిని తీసుకొని సీజ్ చేయడమైనది. అనంతపురం టౌన్ కు చెందిన నర్సింహులు కి 13 సంవత్సరముల క్రితం పద్మావతి బాయి కూతురు మంజుల బాయితో వివాహం అయినది. వారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. అయితే నరసింహులు చెడు అలవాట్లకు బానిసై భార్యను పిల్లలను పట్టించుకోకుండా వారిని హింసిస్తూ ఉండటంతో మంజుల బాయి తన భర్తతో దూరంగా ఇద్దరు పిల్లలను తీసుకుని అమ్మ పద్మావతి బాయ్ దగ్గర ఉంచి బతుకు తెరువు నిమిత్తం కువైట్ కు వెళ్ళినది. అయితే భార్య భర్తలు దూరం అవ్వడానికి అంతే కారణమని పగ పెంచుకొని అతను చెడు అలవాట్లకు బానిసై డబ్బు ఇవ్వలేదని కోపంతో పద్మావతి బాయ్ ని చంపాలని ప్లాన్ వేసుకుని ఏడవ తేదీ సాయంత్రం 6 గంటలకు మచ్చు కత్తితో ఇంటి వద్ద ఉన్న పద్మావతి బాయ్ దాడి చేసిన ఘటనపై పద్మావతి బాయ్ కూతురు శ్యామల బాయి ఇచ్చిన ఫిర్యాదు పై నందలూరు పోలీస్ వారు క్రైమ్ నెంబర్102/2025 సెక్షన్109 BNS క్రింద కేసు నమోదు చేసి ఈరోజు వాయకారి నరసింహులు నీ అరెస్టు చేసి అతనిని రిమాండ్ నిమిత్తం నందలూరు కోర్టుకు పంపడం జరిగినది.