Listen to this article

దౌల్తాబాద్, సెప్టెంబర్ 13 (జనం న్యూస్ చంటి):

దౌల్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు జిల్లా కో కన్వీనర్ మట్ట మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా 15 రోజులపాటు చేపట్టే ప్రత్యేక కార్యక్రమాలపై విస్తృత చర్చ జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు కురుమ గణేష్, చిక్కుడు స్వామి, కిసాన్ మోర్చా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, శక్తి కేంద్ర ఇన్‌చార్జ్‌లు, బూత్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.