

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 28 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:-పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుంచి లోపలికి వచ్చే పెద్ద వాహనాల రద్దీ దృష్ట్యా ఇనుపరాడ్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ రాడ్డులను సగం మేర కొందరు తొలగించారు. దీంతో పాదాచారుల కాళ్లకు తగిలి రక్తస్రావాలుగా మారుతున్నాయి. టూ వీలర్ వాహనాల టైర్లకు పంచర్లలు అవుతుతున్నాయి.దింతో పలువురు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై సూర్య దినపత్రికలో ఈ నెల 20వ తేదిన వార్త ప్రచురించడం జరిగింది. ఈనేపద్యంలో కీర్తి చెంచు స్పందించి వాటి స్థానంలో తిరిగి ఇనుప రాడ్డులు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న దుకాణదారులు, పాదచారులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు