

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు విద్యార్థినులు కడప స్పోర్ట్స్ స్కూల్ మరియు పులివెందులలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి అండర్ 19, అండర్ 17 మరియు అండర్ 14 రగ్బీ పోటీలలో తమ ప్రతిభ చాటి జి.గురు స్నేహ లత (ఇంటర్మీడియట్),పి.లక్ష్మి స్పందన(పదవ తరగతి), వై.నవ్య శ్రీ( తొమ్మిదవ తరగతి)మరియు వై.మహిమలు (తొమ్మిదవ తరగతి) లు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికైనట్లు ఆ పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నాగేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినులు క్రీడల్లో ఇలా రాణించటానికి కృషి చేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.జి సునీత ను మరియు విద్యార్థినులను ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు తల్లి దండ్రులు అభినందనలు తెలిపారు.