

జనం న్యూస్ 19 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా.
పూడూర్ మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పక్కన చెత్తచెదారని వేయవద్దన్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల పరిసరాలు మురుగు నీరు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు అందరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అబ్దుల్లా, ఆశ వర్కర్ మంజుల, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.