

చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిస్తాం..
డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి
జనం న్యూస్, సెప్టెంబర్ 19, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మంజునాథ్ కుటుంబం రోడ్డున పడడం దురదృష్టకరమని, అత్యంత బాధాకరమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వర్గల్ మండలం గౌరారం గ్రామంలో మృతి చెందిన మంజునాథ్ సంతానం నైనిక, అక్షయ్ లను శుక్రవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే చిన్నారుల దీనస్థితిని కలెక్టర్ దృష్టికి తెచ్చి విద్యాబుద్ధులు చెప్పించేందుకు దృష్టి పెడతానని హామీ ఇచ్చారు. కాగా గ్రామానికి బ్రతుకుతెరువు నిమిత్తం వచ్చిన మంజునాథ్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమై అనారోగ్యం బారిన పడి మృతి చెందగా, అప్పుల పాలైన భారతమ్మ, కవిత ఆత్మహత్య చేసుకోవడం తమను తీవ్రంగా కలచివేసిందని, ఇలాంటి దుస్థితి ఎవరికి రావద్దని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మంజునాథ్ తండ్రి కూడా మృతి చెందినట్లు తెలుస్తుండగా, ఆ ఇద్దరు చిన్నారుల్లో అనాధలనే భావన లేకుండా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అంతేకాకుండా మానవతావాదులు ముందుకు వచ్చి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున రూ 36 వేల ఆర్థిక సహాయం అందించగా, భవిష్యత్తులో చిన్నారులకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, గౌరారాం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింహ గౌడ్, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు బోర్క నర్సింలు, కాంగ్రెస్ నేతలు తాళ్ళ భాను గౌడ్, కరుణాకర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, భాస్కర్ గౌడ్, గణేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
