

జనం న్యూస్ 19.సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా.
కొమురం బీమ్ జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలైన ఆదివాసీ వృద్ధ విధవరాళ్లకు వారి ఇబ్బందిలో ఆదరించి, పరామర్శించి వారికి ఇంపాక్ట్ డైరెక్టర్ ఆనంద్ శామ్యూల్, ప్రీతి మరియు స్టాప్ ఆధ్వర్యంలో వృద్ద విధవరాళ్లకు దుప్పట్లు,స్కూల్ చిన్నారులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బార్లు, చక్మర్స్, బిస్కట్స్ పంపిణి చేసి ఈ గ్రామాలను దర్శించి,జోడెన్ ఘాట్, గారిన్ గూడ, మార్ల వాయి, టొకన్మోవడా, చిన్న పాట్నపూర్, గ్రామాల్లో పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఇంపాక్ట్ ప్రతినిధి ఆనంద్ శామ్యూల్ మాట్లడుతూ ఈ మారుమూల గ్రామాల్లో పర్యటించడం నాకు చాలా సంతోషం కలిగించింది, మారుమూల నిరుపేదలకు సామాజిక కార్యక్రమంలు చేపట్టి అభివృద్ధి చేయుటకు నావంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు, అలాగే ఇంపాక్ట్ సహాయకూరలు ప్రీతి మాట్లాడుచు మల్లి మళ్లి ఈ ప్రజల మధ్యకు వచ్చి స్త్రీలకు అనేక సహాయ కార్యక్రమం లు చేసి మారుమూల ల్లో ప్రజలకు సేవ చేయాలని ఉన్నాదని తెలిపారు, ఈ కార్యక్రమం కంటె ఏలియా బాధ్యత తీసుకొని, కంటె ఉపేందర్ ఆధ్వర్యంలో నడిపించబడి, మాజీ సర్పంచ్ కనక ప్రతిభ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది, ఈ కార్యక్రమం విజయవంతం చేయుటకు ఆర్థిక సహాయం అందించిన ఇంపాక్ట్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జైనూర్ స్థానిక నాయకులు కంటె ఏలియా, కంటె మేరి,ఈ ప్రోగ్రాం లో అడా సోనే రావ్, పిల్లలు యవ్వనస్థులు, వృద్దులు తదితరులు పాల్గొన్నారు.

