

పి.ఏ పల్లి మండలంలోని ఉద్దిపట్ల గ్రామపంచాయతీలో పలుగు తండా లో గత ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన ప్రాజెక్టు కాలువలో పడి ప్రమాదవశాత్తు మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి మంజూరు అయిన చెక్కులను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమణారెడ్డి మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి తీర సత్యం రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భౌడియా నాయక్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొర్ర రామ్‌సింగ్ నాయక్ మాజీ సర్పంచ్ జవహర్లాల్ సీతారాం అయ్యన్న యాదవ్ యువ నాయకులు శ్రీరాం నాయక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.