Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 29 (జనం న్యూస్):- ప్రకాశం జిల్లా, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మార్కాపురం మాజీ శాసనసభ్యులు, అవినీతి రహిత పరిపాలన దక్షుడు అయినటువంటి కుందురు నాగార్జున రెడ్డి కార్యకర్తలను, నాయకులను ఉద్దేశించి ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని ఒక ప్రకటనలో తెలియజేశారు. అధికార పక్షానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఒక ఆనవాయితిగా మార్చుకోవడం దురదృష్టకరమని తెలియజేశారు.గిద్దలూరు నియోజకవర్గ స్థాయిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు గాని, కార్యకర్తలకు గాని, ఎలాంటి ఏ చిన్న ఇబ్బంది కలిగిన పూర్తిస్థాయిలో వారికి అండగా ఉంటామని తెలియజేశారు. గిద్దలూరు నియోజకవర్గ స్థాయిలోని కార్యకర్తలు నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి పని చేసే నాయకులను, కార్యకర్తలను తప్పక గుర్తుపెట్టు కుంటామని ఈ విషయంలో ఎవరు సందేహ పడవలసిన అక్కర్లేదని తెలియజేశారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన సంక్షేమ పథకాలను మరోసారి ప్రజలందరికీ గుర్తు చేయాలని, గ్రామములో జరిగిన అభివృద్ధి గురించి చర్చించాలని సూచించారు. గిద్దలూరు నియోజకవర్గ స్థాయిలో మన ప్రభుత్వంలో జరిగిన పట్టణ పల్లెల ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్ లు, వైద్యశాలలు, జగనన్న గృహ నిర్మాణాలు, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు, ఎవరిని ఉద్దేశించి కించపరిచే పోస్టులు పెట్టరాదని సూచించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు, పార్టీకి అండగా ఉండి నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతానికి విశేష కృషి చేయాలని నిరంతరము ప్రతిక్షణం మీ అందరికీ తోడుగా, నీడగా, ఒక సోదరినిగా ఏ చిన్న కష్టం వచ్చినా నేను మీ అందరికీ అండగా ఉంటానని మరోసారి మన జగనన్న ను మనము అందరము కలిసి ముఖ్యమంత్రిని చేసుకొని మరోసారి ప్రజల అందరికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పాలన అందించడానికి కృషి చేద్దామని తెలియజేశారు.