

జనం న్యూస్ జనవరి 28 శాయంపేట మండలం ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత పై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై జక్కుల పరమేష్ తెలియజేశారు మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద మంగళవారం రోజున కూలీలకి గూడ్స్ ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు ప్రైవేటు వాహనాలలో కూలీలు పనుల కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు కూలి పని కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామంలోనే పనులు చూసుకోవాలని కూలీలకి సూచించారు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత పై తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వాహనాన్ని వేగంగా నడప వద్దని మద్యం సేవించి వాహనం నడపవద్దు సిగ్నల్ పాయింట్ సమయపాలన పాటించాలని డ్రైవర్లకు సూచించారు ప్రవేట్ వాహనాలలో ప్రయాణాలు చేయవద్దని ఒకవేళ చేసిన రోడ్డు జాగ్రత్తలు పాటిస్తూ కూలీలు సురక్షితంగా గమ్యము చేరుకోవాలని తెలిపారు ప్రజల సంక్షేమమే పోలీసుల లక్ష్యం ధ్యేయమని ఎస్సై పేర్కొన్నారు….