

జనం న్యూస్ 29 జనవరి కొత్తగూడెం నియోజకవర్గం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక బీసీ కార్యాలయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న జన నాయక్ కర్పూరి ఠాకూర్ శతజయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు తూముల సదానందం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భద్రాద్రి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కురిమెళ్ళ శంకర్ మరియు కేటీపీఎస్ బీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ కొమరవెల్లి రవీందర్ నోపా అధ్యక్షులు ఎలమందల కృష్ణ ప్రసాద్ ఉపాధ్యక్షులు లింగంపల్లి దయానంద్ వెంకన్న ప్రసంగిస్తూ నాయి బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆణిముత్యం బిహార్ రాష్ట్రంలోని సమస్తాపూర్ జిల్లాలో పుట్టిన కర్పూరి ఠాగూర్ మొదటగా ఎన్ఎస్యుఐ యూనియన్ లో పోరాటాలు సాగిస్తూ 1952లో ఎమ్మెల్యేగా గెలుపొంది అనేక పోరాటాలు చేసి జైలు జీవితాలు విద్యా శాఖ మంత్రిగా ఉపముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా సేవలందించి నిరాడంబర జీవితాన్ని గడిపి ప్రపంచానికి ఆదర్శవంతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అతను పేద ప్రజలకు అతి తక్కువ కాలంలో ఎక్కువ సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రిగా పేరుగాంచినారు అని తెలియజేయడం జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మాధవరావు గోరంట్ల వెంకటేశ్వర్లు రమణ నాయకులు కురిమెళ్ళదుర్గయ్య వెంకన్న పాల్వంచ పట్టణ అధ్యక్షులు పుల్లారావు మరియు కమిటీ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు