Listen to this article

పాపన్నపేట. సెప్టెంబర్.19 (జనంన్యూస్)

పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి గ్రామ శివారు నుంచి గురువారం రాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.ట్రాక్టర్ లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.మండలంలో మంజీరా నది, చెరువుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.