జనం న్యూస్ సెప్టెంబర్ 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన గ్రామ దేవత శక్తి స్వరూపిణి శ్రీ మావులమ్మ తల్లి దేవస్థానం నందు శ్రీ ఆది గణపతి స్వామి నవరాత్రులు ముగింపు సందర్భంగా శ్రీ ఆణి విళ్ళ వెంకటరమణ శాస్త్రి సేవా ట్రస్ట్ తరుపున మరియు గ్రామ ప్రజలు, వర్తక సంఘాలు, జాతరలు చేయించే భక్త బృందాలు వారి సౌజన్యంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించారు.స్వామివారి సేవా కార్యక్రమంలో భాగంగా ఆలయ అధ్యక్షులు ఆణి విళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఆకొండిఉమామహేష్, రాష్ట్ర బిజెపి కోశాధికారి గ్రంధి నానాజీ, ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి,చెరుకు బాపిరాజు, తాతపూడి గోపి, యల్లమిల్లి రమేష్ ,చెరుకుకృష్ణ, గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు,సంసాని సత్య నారాయణ,గ్రంధి సత్తిబాబు, శ్రీరామ్,పండు,పవన్,,గ్రంధి,రాముడు వేదు ల శ్రీను, ఆకొండి రాధ, మంత్రి ప్రగడ శ్రీనివాస్, ఆణి విళ్ళ వాసు, తాతపూడి బుల్లి, మరియు పలువురు పాల్గొన్నారు.అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించారు.



