Listen to this article

జనం న్యూస్ 20 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జోగులాంబ గద్వాల జిల్లా పాలకమండలికి ఎన్నికైన నూతన కార్యనిర్వాహక సభ్యులు ఈరోజు జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం నందు గౌరవ జిల్లా ఎస్పీశ్రీ టి. శ్రీనివాస్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి బోకే మరియు శాలువతో సత్కరించడం జరిగింది… మూడు సంవత్సరాల పదవీ కాలానికి ఎన్నికైన ఈ కార్యనిర్వహక సభ్యులు గౌరవ జిల్లా ఎస్పీ సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.అంతేకాదు చాలా సంవత్సరాలుగా కోరుతున్న రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, రక్తనిధి కేంద్రం మరియు ఈ మధ్యనే మంజూరు కాబడిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ స్థల విషయంలో ఎస్పీ తో చర్చించడం జరిగింది… అంతేకాదు ఈ సందర్భంగా ఎస్పీ రెడ్ క్రాస్ సొసైటీ నూతన పాలకమండలికి ఎన్నికైన జిల్లా చైర్మన్ సంగాల అయ్యపు రెడ్డి,రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు
జి.రమేష్ మరియు ఇతర కార్య నిర్వాహక సభ్యులను గౌరవిస్తూ…మీరు చేసే అన్ని కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారం ఉంటుందని రెడ్ క్రాస్ స్థల కేటాయింపు మరియు డే కేర్ సెంటర్ భవన సదుపాయాల విషయంలో తన సంపూర్ణ సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలుపడం జరిగింది…ఇదే సందర్భంలో జిల్లా అడిషనల్ ఎస్పీ గౌ!!శ్రీ.వై.మొగులయ్య ని కలిసి ఆయనను కూడా సత్కరించి రెడ్ క్రాస్ సొసైటీ భవిష్యత్తు కార్యచరణను వివరించి వారి సహాయ సహకారాల గురించి చర్చించడం జరిగింది…
గౌరవ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ అధ్యక్ష, ఉపాధ్యక్షుల సహాయ సహకారాలతో నూతనంగా ఎన్నికైన పాలకమండలి సభ్యులందరు చురుకుగా తమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని ఆశిద్దాం…
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యనిర్వాహక సభ్యులు గంగాధర్ గౌడ్, రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ మల్లికార్జున్,చాగాపురం లక్ష్మీనారాయణ గౌడ్, అక్బర్ బాషా,బండారి పాల్ సుధాకర్ మరియు మహేష్ నాయుడు పాల్గొనడం జరిగింది….. ఇట్లు జి రమేష్, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు, సంగాల అయ్యపు రెడ్డి, జిల్లా చైర్మన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ,జోగులాంబ గద్వాల జిల్లా…