



నిందితులు అరెస్టు రిమాండ్ కు తరలింపు
పథకం ప్రకారమే హత్య చేయించిన భార్య
భర్తను చూపేందుకు లక్ష రూపాయల సుపారి ఇచ్చిన బార్య
జనం న్యూస్. జనవరి 29. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను అడ్డు తొలగించాలనె ఉద్దేశంతో బార్య పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంది కిరాయి హంతకులకు సుఫారి రూపంలో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని భర్తను హత్య చేయించాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం ప్రియుడితో చేతులు కలిపి అతి దారుణంగా భర్తను హత్య చేయించిందని మంగళ వారం సాయంత్రం పోలీసులు వెల్లడించారు.కామారెడ్డి జిల్లా బిక్కు నూర్ మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన మాలె నారాయణ (42) సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డి ఖానాపూర్ గ్రమశివారులోని ఒక స్వచ్ఛంద సంస్థ లో అకౌంటెంట్ గా పని పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. మృతుడు నారాయణకు బార్య లక్ష్మి ఇద్దరు పిల్లలతో కలిసి స్వ గ్రామం మల్లు పల్లి లొ నివసిస్తున్నారు. నారాయణ రెడ్డి ఖానాపూర్ లో ఉంటు ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు మృతిని బార్య లక్ష్మి నరసవ్వ నారాయణకు రెండవ పెళ్ళి చేసుకుంది. లక్ష్మి కొంత కాలంగా ఓ రాజకీయ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తుంది అదే మండలం రామేశ్వరం పల్లీ గ్రామానికి చెందిన రాకేష్ తో పరిచయం పెంచుకుంది.ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి తావిచ్చింది . ఈ విషయం భర్త నారాయణకు తెలియడం తో పలు మార్లు పెద్దల సమక్షంలో పెట్టీ సర్ది చెప్పారు అయినప్పటికీ తన భార్యలో మార్పు రాకపోవడంతో తరచూ గొడవ పడేవారు ఈ నేపథ్యంలో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపడానికి ప్రణాళిక వేసుకుంది తన భర్తను అంతమొందించడానికి ప్రియుడితో చేతులు కలిపి మరో ముగ్గురు హంతకులకు లక్ష రూపాయలు సూపారి ఇచ్చింది. అడిట్ పని వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో లక్ష్మీ భర్త నారాయణ రమ్మని ఫోన్ చేయగా 24 శుక్రవారంనాడు తన ఇద్దరు పిల్లలతో కలిసి రెడ్డి ఖానాపూర్ గ్రామంలో ఉంటున్న తన భర్త వద్దకు చేరుకుంది. ముందే ప్రాణాలిక సిద్ధం చేసుకున్న లక్ష్మి తన భర్త ను చంపేందుకు ఇదే సరియైన సమయమని భావించి. అక్కడే ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది. నారాయణ బయటకు వెళ్లి వస్తానని చెప్పడంతో ప్రియుడు రాకేష్ తో పాటు మరో ముగ్గురు హంతకులను నారాయణ ఇంట్లో మరణాయుధాలతో కాపు కాస్తూ కూర్చున్నారు నారాయణ ఇంట్లో కి రాగానే హఠాత్తుగా ఒక్కసారి హంతకులు మారణాయుధాలతో విచక్షణారహితంగా నారాయణపై దాడి చేసి చంపారు. మృత దేహాన్ని పల్పనూరు గ్రామ శివారులోని నిర్మానుష ప్రాంతంలో ముళ్ళ పొదల్లో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతుని బార్య లక్ష్మి పై అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా .తన ప్రియుడు రాకేష్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తుల సహాయంతో తన భర్త ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని. సిఐ నయీముద్దీన్. హత్నూర ఎస్సై కే శుభాష్ తో కలిసి మీడియాతో వెల్లడించారు.