Listen to this article

ఆదర్శ ఫైన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో గత నెలలో అనంతపురం జిల్లాలో డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ నిర్వహించారు. అందులో గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పాల్గొని డ్రాయింగ్ మరియు హ్యాండ్ రైటింగ్ పోటీలలో ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రతిభను కనబరిచారు. విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కారణంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించారు.వారు మాట్లాడుతూ జాతీయ స్థాయి లలిత కళల పోటీలో పతకాలు మరియు సర్టిఫికెట్లు అందుకున్న విజేతలను అభినందనలు తెలిపారు. ఆలాగే పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతిర్మయి, అకడమిక్ కోఆర్డినేటర్ ఆంజనేయులు మాట్లాడుతూ విద్యార్థులు ఇంకా ఇలాంటి మరియెన్ని పథకాలను సాధించాలి అని, అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హ్యాండ్ రైటింగ్ మాస్టర్ శ్రీనివాసులు ఆర్ట్ టీచర్ గిరీష్, అరుణకాంతి ఉపాద్యాయుని,ఉపాధ్యాయలు, పాల్గొన్నారు…