Listen to this article

జనం న్యూస్ 21 సెప్టెంబర్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలో రైతు వేదిక లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 49 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు రూ. 15,58,000/- విలువైన చెక్కులను అందజేశారు. చెక్కుల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, ఖరీదైన వైద్యం చేయించుకోలేని పేద, నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. మానవతాదృక్పథంతో సీఎం రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చెక్కుల పంపిణీ అనంతరం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామన్ సర్వీస్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి తహసిల్దార్ ప్రవీణ్ కుమార్ వ్యవసాయ అధికారి గంగా జమున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..