

జనం న్యూస్ జనవరి 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- ఇది ప్రజల ప్రభుత్వమని వారి సమస్యలను ఆలకించి వాటి పరిష్కారానికి వెంటనే తగు చర్యలు తీసుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ దరఖాస్తులను కొంతమంది అధికారులు సిబ్బంది ఇంకా పూర్తిస్థాయిలో కంప్యూటరైజేషన్ చేయలేదు. దీంతో ఇళ్ల దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతోపాటు నియోజకవర్గంలో మరి కొంతమంది నూతనంగా ఇళ్ళ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న సందర్భంలో పరిస్థితిని కాంగ్రెస్ ఇంచార్జ్ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన మున్సిపల్ అధికారులతో మంగళవారం సమావేశమై చర్చించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మూసాపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ లిఖితపూర్వకంగా ఓ నోట్ విడుదల చేశారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకొని కంప్యూటర్లో నిక్షిప్తం చేయని వాటిని వెంటనే నిక్షిప్తం చేయాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు కూడా నమోదు చేయాలని సూచించారు మూసాపేట సర్కిల్ పరిధిలో కెపిహెచ్బి డివిజన్ కు శైలజ, బాలాజీ నగర్ డివిజన్ కు నాగరాజు, అల్లాపూర్ డివిజన్ కు గిరిధర్, మూసాపేట డివిజన్ కు బిక్షపతి, ఫతేనగర్ డివిజన్ కు రియాజ్ ఉద్దీన్ ను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. కనుక దరఖాస్దారులందరూ ఆయా వాది కార్యాలయంలో సంబంధిత సిబ్బందిని సంప్రదించాల్సిందిగా రమేష్ పేర్కొన్నారు.