Listen to this article

జనం న్యూస్;22 సెప్టెంబర్; సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్ ;

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతిబింబం బతుకమ్మ పండుగ అని సిద్దిపేట జిల్లా విద్యాధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బెజ్జంకి మండలం ప్రాథమిక పాఠశాల గుండారం పాఠశాల విద్యార్థులు పూలవనం పాటపై నృత్యం చేసి వీడియో అందించినందుకు అభినందనలు తెలియజేస్తూ, పూలవనం గేయ రచయిత ఉండ్రాళ్ళ రాజేశం మరిన్ని మంచి రచనలు చేసి సమాజానికి అందించాలన్నారు. అనంతరం తెలంగాణ పూలవనం వీడియోను ఆవిష్కరించారు. విద్యతోపాటుగా అన్ని రంగాల్లో విద్యార్థులు ముందుండాలన్నారు. కార్యక్రమంలో బెజ్జంకి మండల విద్యాధికారి మహతీలక్ష్మి. గుండారం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండ్రాళ్ళ తిరుపతి, ఉపాధ్యాయులు జెంగోని శ్రీనివాస్, బైరి అనీల్ కుమార్, అక్కెం ఐలయ్య, కవులు ఆదిమూలం చిరంజీవి, బండారి శ్రీనివాస్, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.